విజ‌య్‌, అట్లీ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

'తెరి', 'మెర్స‌ల్‌' వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. హీరో విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న 63వ చిత్రానికి 'బిగిల్‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల‌చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఓల్డ్ లుక్ ఉన్న విజ‌య్‌తో పాటు.. యంగ్ లుక్‌లో ఉన్న విజ‌య్ కూడా ఉన్నాడు. ఓల్డ్ లుక్‌లో ఉన్న విజ‌య్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ప‌క్కా మాస్‌గా క‌న‌ప‌డుతుంటే.. యంగ్ విజ‌య్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్‌కు అభిమానులు, ఆడియ‌న్స్ నుండే కాదు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.

విజ‌య్ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. ర‌హ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమా విడుద‌ల‌వుతుంది.

More News

పవన్ తాజా లుక్‌పై నాగబాబు రియాక్షన్.. క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అట్టర్ ప్లాప్ కాగా.. వైసీపీ విజయకేతనం ఎగరేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాదు కదా..

బిగ్ బాస్-3 ప్రోమో రిలీజ్.. ఆయనెవరో తెలిసిపోయింది!

తెలుగులో బిగ్‌బాస్ 1,2 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. టూకు నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌‌గా వ్యవహరించిన విషయం విధితమే.

చంద్రబాబుకు ముందే తెలుసా.. ఇదంతా భారీ ప్లానా!?

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరతారని చంద్రబాబుకు ముందే తెలుసా..? చంద్రబాబే ఆ నలుగుర్ని బీజేపీలో చేర్పించారా..?

విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు!

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు..

సీక్రెట్‌ నిశ్చితార్థంపై రెజీనా క్లారిటీ ఇచ్చేసింది!

గత కొన్ని రోజులుగా హీరోయిన్ రెజీనాకు రహస్యంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.