close
Choose your channels

విజ‌య్‌, అట్లీ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

Saturday, June 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్‌, అట్లీ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

`తెరి`, `మెర్స‌ల్‌` వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ త‌ర్వాత విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. హీరో విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న 63వ చిత్రానికి `బిగిల్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల‌చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఓల్డ్ లుక్ ఉన్న విజ‌య్‌తో పాటు.. యంగ్ లుక్‌లో ఉన్న విజ‌య్ కూడా ఉన్నాడు. ఓల్డ్ లుక్‌లో ఉన్న విజ‌య్ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ప‌క్కా మాస్‌గా క‌న‌ప‌డుతుంటే.. యంగ్ విజ‌య్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌గా క‌న‌ప‌డుతున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్‌కు అభిమానులు, ఆడియ‌న్స్ నుండే కాదు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.

విజ‌య్ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. ర‌హ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమా విడుద‌ల‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.