విజయదేవరకొండ దర్శకుడికి పెళ్లి!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్. తెలంగాణ యాసను, తెలుగును ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఈ మధ్య తమిళ్ కూడా అంతే బాగా మాట్లాడుతున్నారు. మరణ వెయిటింగ్ అంటూ తమిళ ఫ్రేస్లు కూడా చెప్పేస్తున్నారు. ఆయన్ని అంతగా సిద్ధం చేసింది `నోటా` చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్. సినిమా ఫ్లాప్ అయినా, వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది.
ఆనంద్ శంకర్ మురుగదాస్ శిష్యుడు. మురుగదాస్ దగ్గర నుంచి బయటికి వచ్చాక ఆయన కొన్ని చిత్రాలు తీశారు. నోటా తప్ప మిగిలినవి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేశారు. జూలై 11న దివ్యాంకతో తన వివాహం జరగనుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన యాచ్‌లో ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. తనకు సిగ్గు ఎక్కువని, వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టడం ఇష్టం ఉండదని, కానీ ఈ క్షణాలను అభిమానులతో పంచుకోవాలనే కోరికతో ఈ విషయాలన్నీ చెబుతున్నాననీ ఆయన అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.