22 జులై 11.05 నిమిషాలు జిఏ2 పిక్చ‌ర్స్ 'గీత‌గోవిందం' టీజ‌ర్ రిలీజ్‌

  • IndiaGlitz, [Saturday,July 21 2018]

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం గీత గోవిందం. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం. గీత గోవిందం మెద‌టి సింగిల్ ని విడుద‌ల చేసిన ద‌గ్గ‌ర‌నుండి విప‌రీతంగా వైర‌ల్ అవుతూ తెలంగాణా, ఆంద్రా లోనే కాకుండా ప్ర‌పంచంలో వున్న తెలుగు వారంతా మెబైల్స్ లో, సావ‌న్‌, వింక్‌, ఆదిత్యా, గానా లాంటి ఫెమ‌స్ యాప్స్ లో విన‌ట‌మేకాకుండా హ్యూజ్ గా డబ్‌స్మాష్ లు వాట్స‌ప్, ఫేస్‌బుక్ స్టేట‌స్ లుగా పెట్టుకుని సుమారు కొటి వ్యూస్ ని సాధించి ఇంకేమి కావాలి ఇంకేమి కావాలి అంటూ ఇంకా ముందుకు దూసుకుపోతుంది. ఇదిలా వుంటే గీతా గోవిందం చిత్రం టీజ‌ర్ ని 22 జులై 11.05 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ ఈ చిత్రానికి ఎక్స‌లెంట్ మ్యూజిక్ ని అందించారనేది అర్ధ‌మవుతుంది. అలాగే టీజ‌ర్ కి కూడా సూప‌ర్బ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

అన్ని కార్య‌క్రమాలు పూర్తిచేసి అగ‌ష్టు 15న ఈ చిత్రం విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.. ఈ టీజ‌ర్ కొసం ఇప్ప‌టికే గూగుల్‌, యూట్యూబ్ లో సెర్చ్ ఇంజ‌న్ స్టార్ట‌వ్వ‌టం ఈ చిత్రంపై వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందుతున్న ఈ చిత్రానికి మ‌ణికంద‌న్ చ‌క్క‌టి కెమెరా ప‌నితనం అందించారు. ఆర్ట్ ర‌మ‌ణ వంక, ఎడిట‌ర్ మార్తాండ్ కె వెంక‌టేష్ చ‌క్క‌టి ప‌నితీరుని చూపించారు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం హైలెట్ గా నిలుస్తుంది. ఇదిలా వుంటే క్రేజి హీరో విజ‌య్‌దేవ‌ర కొండ‌, క్రేజి హీరోయిన్ ర‌ష్మిక పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా అందంగా వుండ‌టం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

More News

సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తి, జులై 27 న 'మెహిని' విడుద‌ల

తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌దైన అందంతో అభినయంలో ద‌శాబ్ద‌కాలం గా టాప్ హీరోయిన్ గా ఆక‌ట్టుకున్న త్రిష తిరిగి మెహిని గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపించిన చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌' - నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్‌

తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

మ‌రో సినిమాకు రెడీ అవుతోన్న అఖిల్‌

అక్కినేని అఖిల్ స్పీడు పెంచాడు. తొలి చిత్రం అఖిల్ త‌ర్వాత హ‌లో కోసం చాలా స‌మ‌యం తీసుకున్న అఖిల్ మూడో సినిమాను వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు.

'జిగేల్ జిగేల్' మూవీ ప్రారంభం

శ్రీ నవ నారాయణ సినీ క్రీయేషన్స్ పతాకం పై అభయ్ , గీత్ షా హీరో హీరోయిన్లు గా నాగరాజు తలారి దర్శకత్వం లో అంజనప్ప , నాగరాజ నిర్మాతలుగా నిర్మిస్తున్న

నాగు గవర రెండవ చిత్రం ప్రీలుక్ కి మంచి స్పందన

"బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్" లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై