విజ‌య్ దేవ‌ర‌కొండ `హీరో` ప్రారంభం కానుంది..

  • IndiaGlitz, [Sunday,October 20 2019]

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో డెబ్యూ డైరెక్ట‌ర్ ఆనంద్ ఆన్నామ‌లై ద‌ర్శ‌క‌త్వంలో 'హీరో' సినిమా అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే బ‌డ్జెట్ ఎక్కువ అయ్యే కార‌ణాలుండ‌టంతో సినిమాను కొన్నాళ్లు పాటు ఆపేశారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాను ట్రాక్ ఎక్కిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన కొంత మేర చిత్రీక‌రణ‌ను పూర్తి చేశారు. 15 రోజుల పాటు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌లో రేసింగ్ కోసం రోజుకు 50 ల‌క్ష‌ల రూపాయ‌లు మేర ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ రేస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నార‌ట‌. అందుకోసం కోయంబ‌త్తూరులో రేస‌ర్ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ‌ను కూడా తీసుకున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే మ‌రికొన్ని రేసింగ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' సినిమా రూపొందుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

`మా`లో గంద‌ర‌గోళం.. వివ‌రాలు మ‌ళ్లీ చెబుతామంటూ వెళ్లిపోయినా జీవిత, రాజ‌శేఖ‌ర్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడ‌వ‌లు బ‌ట్ట‌బ‌య‌లైయ్యాయి. గ‌త కొన్నిరోజులుగా ఓకే ప్యాన్‌లో నిలిచి గెలిచి..

ఇవాళ ‘మునిగిన బోటు’ బయటికొచ్చే అవకాశం!

తూర్పుగోదారి జిల్లా కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటును ఇవాళ సాయంత్రం బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

‘మా’లో తారాస్థాయికి విభేదాలు.. పరుచూరి కంటతడి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం నాడు జరిగిన మా అసిసోయేషన్ మీటింగ్ గందరగోళంగా మారింది.

వెంకీతో బాలీవుడ్ న‌టుడు

విక్ట‌రీ వెంక‌టేశ్‌, త‌రుణ్ భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ  సినిమాను రూపొందించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' సక్సెస్ మీట్

బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌'.