ఏప్రిల్ నుంచి విజయ్ దేవరకొండ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,January 30 2018]

పెళ్ళి చూపులు చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి విజ‌యం అందుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక గ‌తేడాది వ‌చ్చిన అర్జున్ రెడ్డితో టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అయ్యారు. పాథ్ బ్రేకింగ్ మూవీగా ప్ర‌శంస‌లు పొందిన ఈ సినిమా త‌రువాత‌.. అర‌డ‌జ‌నుకి పైగా సినిమాల‌తో బిజీగా మారిపోయారు విజ‌య్‌. వీటిలో మూడు చిత్రాలు వేస‌వికే విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

విజ‌య్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న మ‌హాన‌టి మార్చి 29న విడుద‌ల కానుండ‌గా.. టాక్సీవాలా, గీతాగోవిందం సినిమాలు కూడా వేస‌వికే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఓన‌మాలు, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు చిత్రాల ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ చిత్రాన్ని చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మించ‌నున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలిసింది. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డ‌తాయి.

More News

'ఇంటిలిజెంట్‌' సెకండ్ సాంగ్ 'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌...' రిలీజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'ఇంటిలిజెంట్‌'.  సోమవారం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ 'చ‌మ‌కు చ‌మ‌కు చామ్‌...' ను రిలీజ్ చేశారు.

ఎక్కడ నా ప్రేమ ఆడియో విడుదల...

మనోజ్ నందం,సౌందర్య జంటగా నటిస్తున్న చిత్రం ఎక్కడ నా ప్రేమ.

రామ్‌తో అనుప‌మ‌....

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌త్వంలో నిర్మాత దిల్‌రాజు ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.

సీరత్ తో సంబంధం లేదంటున్న రాశి ఖన్నా

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’.

'కృష్ణార్జున యుద్ధం'లో నాని పాత్ర‌లేమిటంటే..

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళా సంగీతమందిస్తున్నాడు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి  చిన్న అంతరాయం కలిగింది.