close
Choose your channels

పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

Tuesday, August 13, 2019 • తెలుగు Comments

పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో సూప‌ర్‌హిట్ సాధించాడు. ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పూరి సినిమా ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. సాధార‌ణంగా పూరి అంటే మాస్‌. హీరోల‌ను మాస్ కోణంలో చూపించ‌డంలో పూరి దిట్ట‌. మ‌రి యూత్‌లో మంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పూరి ఎలా చూపిస్తాడ‌నే దానిపై అంద‌రూ ఆస‌క్తిగా ఉన్నారు. అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర విజ‌య్ దేవ‌ర‌కొండ మార్ష‌ల్ ఆర్ట్స్ తెలిసిన వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడు. దాంతో పాటు మాట‌లు స‌రిగా రాని వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌తాడు. పూరి ద‌ర్శ‌క‌త్వంతో పాటు చార్మితో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తాడ‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz