పూర్తయిన డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్..

  • IndiaGlitz, [Friday,December 28 2018]

వరస విజయాలతో దూసుకుపోతున్న సంచలన హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కడుతున్నారు. గీత గోవిందం తర్వాత వీళ్ళు నటిస్తున్న రెండో సినిమా ఇది. కాకినాడలోని అందమైన లోకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది.

చాలా మంది విద్యార్థులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాలో అతిపెద్ద షెడ్యూల్ ఇదే. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది డియర్ కామ్రేడ్ చిత్రం. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్.. అనే ట్యాగ్ లైన్ తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం.

ఇందులో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More News

'ఏబీసీడీ' ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ : నిర్మాతలు

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

స్టార్ క‌థానాయిక‌ల జోరు హోరు...

ప్ర‌స్తుత ఏడాది కూడా 150కి పైగా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన‌వే. ఇందులో కొంత మంది కొత్త హీరోయిన్స్ బాక్సాఫీస్ వ‌ద్ద సక్సెస్ అందుకున్నా

'మనసు పలికే మౌన ప్రేమ' నూతన చిత్ర ప్రారంభోత్సవం

ఏ ఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై  బాబీ వేంపల్లి దర్శకత్వంలో  నిర్మాత బొట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం 'మనసు పలికే మౌన ప్రేమ'

కొత్త హీరోలు... ప‌రిచ‌య‌మ‌య్యారు!

సినిమా ప‌రిశ్ర‌మ‌కు హీరో డామినేటెడ్ ఇండ‌స్ట్రీ అనే పేరు కూడా చ‌లామ‌ణిలో ఉంది. సినిమా ఓకే కావాలంటే ముందు హీరో ఎవ‌ర‌నేది తెలియాలి.

'ఆర్‌ ఎక్స్‌- 100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

‘ఆర్‌ ఎక్స్‌–100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం