శ‌ర్వానంద్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌...?

  • IndiaGlitz, [Tuesday,September 15 2020]

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. ర‌వితేజ‌, సిద్ధార్థ్ స‌హా ప‌లువురు హీరోల‌ను క‌లిశాడు. అంతా ఓకే అవుతున్న త‌రుణంలో ప్రాజెక్ట్ ఆగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు శ‌ర్వానంద్ హీరోగా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనేదానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ మ‌ధ్య శ‌ర్వానంద్ జతగా సమంత నటిస్తుందని ఆ మ‌ధ్య వార్త‌లు కూడా వ‌చ్చాయి. త‌ర్వాత రాశీఖ‌న్నా పేరు కూడా వినిపించింది. త‌ర్వాత సాయిప‌ల్ల‌వి పేరు కూడా ప‌రిశీల‌న‌లోకి ఉన్న‌ట్లు టాక్ వినిపించింది. కాగా తాజా స‌మాచారం మేర‌కు.. శర్వానంద్ హీరోయిన్‌గా ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది. పెర్ఫామెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను తీసుకున్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. అలాగే ఈ చిత్రంలో మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడుతుందని టాక్.

More News

తండ్రి త‌ర్వాత కొడుకుతో ప‌నిచేయ‌నున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి స్పీడుపెంచాడు. ప్ర‌స్తుతం `ఆచార్య` సినిమాను ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. దీని త‌ర్వాత మ‌రో నాలుగైదు క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు.

అనుష్క 'నిశ్శ‌బ్దం' ఓటీలో ఎప్ప‌టినుండంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా కనపడటమే కాదు.. అవకాశాలను అందిపుచ్చుకుని

బ‌న్నీ ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న త‌మ‌న్

మ్యూజికల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆఫ్ టాలీవుడ్‌. ఈ ఏడాది విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి త‌మ‌న్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది.

ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు యత్నిస్తున్నాయి: రాజ్‌నాథ్

ఇండో- చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.