పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవర కొండ.. సరికొత్త టైటిల్..!

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఫైట‌ర్ అనే టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు బాగా విన‌ప‌డ్డాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు టైటిల్ ఫైట‌ర్ కాద‌ట‌.. లైగ‌ర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని సమాచారం. మ‌గ సింహం, ఆడ పులికి పుట్టిన బిడ్డ‌నే లైగ‌ర్ అని పిలుస్తాం. ఈ పేరునే పూరి త‌న సినిమాకు పెట్టాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయ్యింది. పూరి ద‌ర్శ‌క‌త్వంతో ఛార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మూవీ మేక‌ర్ క‌ర‌ణ్‌జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీక‌పూర్ న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ ఆమె డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో ఆమె న‌టించ‌డం లేద‌ట‌. ఇప్పుడు ఆమె స్థానంలో మ‌రో బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య‌పాండే న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంతా అనుకున్న‌ట్లే జ‌రిగితే అనన్య టాలీవుడ్ డెబ్యూ ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ సిక్స్ ప్యాక్ పెంచుతున్నాడు.

More News

'ఆర్ఆర్ఆర్‌' లో ఛాన్స్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ

ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టిస్తోన్న హాట్ బ్యూటీ హంస నందిని ఇప్పుడు భారీ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది.

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

డిప్యూటీ సీఎంగా కేటీఆర్.. మంత్రిగా ఐపీఎస్!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా..? ఆయనతో పాటు ఐపీఎస్ అధికారి కేసీఆర్ మంత్రి వర్గంలోకి రానున్నారా..? అంటే

టీడీపీకి ‘కళ’ తప్పింది.. ‘అచ్చెన్న’తో అచ్చొస్తుందా!

తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు మారబోతున్నారా..? 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా..?