విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో మూవీ

  • IndiaGlitz, [Monday,September 28 2020]

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని
నిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన కేదార్ భవిష్యత్ లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ లతో చేయబోతున్నట్టు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.విజయ్ ,సుకుమార్ లిద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగే ఉంటాయి.వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం. అని అన్నారు.

More News

దేవి ఎలిమినేట్.. బాగా గేమ్ ప్లే చేస్తున్న బిగ్‌బాస్..

సన్ డే.. ఫన్ డే కాబట్టి సందడి సందడిగా సాగిపోయింది. ‘మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకుందాం’ టాస్క్‌లో భాగంగా ముందు అభిజిత్..

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన నటి హేమ..

సినీ నటి హేమ ఓపెన్ డిగ్రీ పరీక్షలకు హాజరయ్యారు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన హేమ..

23 ఏళ్ల బంధం ముగిసింది.. ఎన్డీయేకు శిరోమనీ అకాలీదళ్ గుడ్ బై..

సుదీర్ఘ ప్రయాణం.. అర్థంతరంగా ముగిసింది. ఎన్డీఏ, శిరోమనీ అకాలీదళ్‌ల మధ్య వ్యవసాయ బిల్లులు చిచ్చు పెట్టాయి.

సిగ్గో సిగ్గు.. బాలు అంత్యక్రియలకు మొహం చాటేసిన టాలీవుడ్!

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం పరమపదించారు. బాలు అంత్యక్రియలు చెన్నై శివారులోని ఫామ్ ‌హౌస్‌లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.

రకుల్‌‌ను డ్రగ్స్ కేసు నుంచి కాపాడేందుకు యత్నిస్తున్న తెలంగాణ పెద్దలెవరు?

డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోందో లేదో కానీ.. టాలీవుడ్‌లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ రంగు పులుముకుని సంచలనంగా మారుతోంది.