close
Choose your channels

400 మందికి బంగారు రింగులు ఇచ్చిన హీరో

Wednesday, August 14, 2019 • తెలుగు Comments

400 మందికి బంగారు రింగులు ఇచ్చిన హీరో

తమిళ స్టార్ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `బిగిల్`. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రతి సినిమాకు చిత్ర యూనిట్‌కు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చే హీరో విజయ్ ఈసారి సినిమా కోసం వివిధ శాఖల్లో పనిచేసిన 400 మందికి బంగారు రింగులను కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతితోపాటు హీరోయిన వర్ష బొల్లమ్మ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విజయ్ తమపై ఎంతో ప్రేమ చూపించాడని వారు పేర్కొన్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది దీపావళికి సినిమా రూపొందనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. విజయ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz