క్రేజీ ప్రాజెక్ట్‌లో విజ‌య్‌

  • IndiaGlitz, [Tuesday,July 23 2019]

విజ‌య్ అంటే త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌.. లేక తెలుగులో క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నో కాదు.. విజ‌య్ సేతుప‌తి, వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌లున్న సినిమాల‌ను మాత్ర‌మే చేసే విజ‌య్ సేతుప‌తి తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డిలో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఇప్పుడు ఉప్పెన‌లో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. కాగా ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. శ్రీలంక స్టార్ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ రూపొంద‌నుంది. ఎంద‌రో క్రికెట్ వీరుల బ‌యోపిక్స్ రూపొందుతోన్న ఈ త‌రుణంలో ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ అంటే క‌చ్చితంగా ఓ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌బోతున్నాట‌. ఈ సినిమాకు '800' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.