ఎన్టీఆర్ బాటలో విజయ్....

  • IndiaGlitz, [Thursday,March 02 2017]

త‌మిళ సూప‌ర్‌స్టార్ విజ‌య్ కూడా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాట‌లో పయ‌నిస్తున్నాడు. ఎలాగంటారా...ఎన్టీఆర్ ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా రూపొందిస్తున్న 'జై ల‌వ‌కుశ‌'(రిజిష్ట‌ర్ అయిన టైటిల్‌) చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో తండ్రి పాత్ర‌తో పాటు ఇద్ద‌రు కుమారులుగా కూడా ఎన్టీఆర్ న‌టిస్తుండ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఇప్పుడు రాజా రాణి పేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ విజ‌య్ న‌టిస్తున్న చిత్రంలో కూడా విజ‌య్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. అందులో తండ్రి పాత్ర‌తో పాటు ఇద్ద‌రు కొడుకులుగా కూడా విజ‌య్ న‌టిస్తున్నాడ‌ట‌. అందులో ఓ పాత్ర పోలీస్ అధికారిగా క‌న‌పిస్తాడ‌ట‌.