'స‌ర్కార్' చిత్రీక‌ర‌ణ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రలో న‌టిస్తుంది. 'త‌పాకీ', 'క‌త్తి' సినిమాల త‌ర్వాత విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉంటుంది.

ఇందులో విజ‌య్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వ‌ర్క్ స‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఆ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఎ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందించిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్నారు. కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టించారు.

More News

వివాదంలో 'ఆర్‌.ఎక్స్ 100' హీరో సినిమా

ఆర్.ఎక్స్ 100 అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన కార్తికేయ ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొంద‌బోయే చిత్రంలోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

కిర్రిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌ర్వాత 'ఛలో' తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ర‌జ‌నీ యూర‌ప్ షెడ్యూల్ ఉందా? లేదా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

క‌మ‌ల్ డ్యూయెల్‌..!

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్న చిత్రం 'ఇండియ‌న్ 2'. యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ...

సెప్టెంబ‌ర్ 6న నోటా ట్రైల‌ర్ విడుద‌ల‌

సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు.