విజయ్ టైటిల్

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇప్పుడు త‌న 61వ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శ‌క‌త్వంలో విజ‌య్ ఇది వ‌ర‌కే థెరి అనే సినిమా చేశాడు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. దీంతో విజయ్ వెంటనే అట్లీకి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి అట్లీ విజ‌య్‌ను పూర్తి మాస్‌గా చూపించ‌బోతున్నాడు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే యువ‌కుడి పాత్రంలో విజ‌య్ లుక్ రిలీజ్ అయ్యింది.

లుక్ చూస్తుంటే జ‌ల్లిక‌ట్టు కాన్సెప్ట్ కూడా సినిమాలో క‌న‌ప‌డుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్‌, స‌మంత హీరోయిన్స్‌. మ‌రి విజ‌య్ ఒక షేడ్ చేస్తున్నాడా..లేదా డ‌బుల్ కానీ త్రిబుల్ షేడ్స్ చేస్తున్నాడ‌నేది తెలియ‌లేదు. ఈ సినిమాకు 'మెర‌స‌ల్‌' అనే టైటిల్‌ను పెట్టారు.

More News

ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి)దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా చేస్తున్నాడు.

రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి

'ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'

పురాణ పాత్రలో రానా....

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది.

మోడి బయోపిక్ లో అక్షయ్...

ఇప్పుడు బాలీవుడ్లో బయోపిక్ లహవా నడుస్తుంది.