close
Choose your channels

వేసవిలో విజయ్ సందడి

Friday, January 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెళ్ళి చూపులుతో సోలో హీరోగా తొలి విజ‌యాన్ని అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గ‌తేడాది విడుద‌లైన అర్జున్ రెడ్డితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్ర‌స్తుతం ఈ యువ క‌థానాయ‌కుడు వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో రెండు సినిమాలు ఈ వేస‌వికి సంద‌డి చేసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే..

యువ‌త‌, సోలో, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతాగోవిందం (ప్ర‌చారంలో ఉన్న పేరు) అనే చిత్రాన్ని చేస్తున్నాడు విజ‌య్‌. గీతాఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ సినిమాని వేస‌వి సంద‌ర్భంగా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ చిత్రంతో పాటు విజ‌య్ న‌టించిన‌ మ‌రో సినిమా కూడా వేస‌విలో సంద‌డి చేయ‌నుంది. ఆ చిత్ర‌మే మ‌హాన‌టి. కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాలో విజ‌య్ అతిథి పాత్ర పోషించాడు. మార్చి 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల‌తో విజ‌య్ అర్జున్ రెడ్డి స‌క్సెస్‌ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.