జగన్ పై మరోసారి పరోక్ష విమర్శలు


Send us your feedback to audioarticles@vaarta.com


వైఎస్ జగన్ పై మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు మాజీ ఎంపీ విజయసాయి. వైసీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టడం ఇదే తొలిసారి కాదు. మరీ ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీపై విజయవాయి విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
"పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే."
ఇలా పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు విజయసాయి. ఒకప్పుడు జగన్ కు అత్యంత ఆప్తుడుగా ఉన్న ఈ వ్యక్తికి కోటరీ పొగపొట్టిందనేది బహిరంగ రహస్యం. జగన్ ను కలవడానికి తనకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని రేంజ్ కు కోటరీ ఎదిగిందన్నారు. అందుకే మనసు ముక్కలై పార్టీ నుంచి తప్పుకున్నానని గతంలో ప్రకటించారు విజయసాయి. ప్రస్తుతం జగన్ చుట్టూ సజ్జల కోటరీ నడుస్తోందనే విమర్శ ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com