‘మీరు ఓడిపోవడమేంటయ్యా.. మీ కష్టాలు పగోడికి కూడా రావొద్దు’!

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేశ్.. టీడీపీ నేతలను ఉద్దేశించి పెద్ద ఎత్తున ట్వీట్లు చేసిన విజయసాయి పంద్రాగస్టు నాడు మరింత డోస్ పెంచి విమర్శనాస్త్రాలు విసిరారు. విజయసాయి వరుస ట్వీట్స్ ఇవీ...

కొంప ముంచాలనే..!

‘ఏడాది క్రితం కృష్ణకు ఇలాంటి వరద వచ్చి ఉంటే మోదీ మెప్పుకోసం మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కావాలనే లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడిచి పెట్టాయని శోకాలు పెట్టేవాడు. పథకం ప్రకారమే తన కొంపను ముంచాలనే కుట్ర పన్నారని కుల మీడియాలో గంటలు గంటలు చెప్పించేవాడు’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ పారిపోయారు!

‘చంద్రబాబు గారి కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో హైదరాబాద్ పారిపోయారు. ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించారు. ఇప్పుడైనా అర్థమైందా బాబు గారూ నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో?. చంద్రబాబు అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించింది. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం లాంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారు. ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే తను హైదరాబాద్‌లో దాక్కున్నాడు’ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

మీరు ఓడిపోవడమేంటయ్యా!

‘మీరు ఓడిపోవడమేంటయ్యా’ అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది. ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు’ అని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే విజయసాయి విమర్శలకు చంద్రబాబు, నారా లోకేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

'గ్యాంగ్‌ లీడర్‌' రెండో పాట విడుదల

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం

లోకేష్‌కు రాఖీ కట్టిన ఊహించని వ్యక్తి!!

అన్నా చెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల మ‌ధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్కలు, చెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీల‌ను క‌ట్టి త‌మ‌కు ర‌క్షగా ఉండ‌మ‌ని

జాతీయ జెండా ఎగురేసిన నేచురల్ స్టార్ నాని

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురేశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో నాని ముఖ్య అతిథిగా పాల్గొని..

తాట తీస్తా.. రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడానికి తామేం బిజినెస్‌మెన్‌లు కాదని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చిన విషయం విదితమే. గత కొన్నిరోజులుగా టాలీవుడ్ పెద్దలెవరూ వైఎస్ జగన్‌ను

ఏడాది పూర్తి చేసుకున్న గీత గోవిందం

మెగా నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా "గీత గోవిందం". టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా