close
Choose your channels

సినిమాల్లోకి రీఎంట్రీపై అనుమానాలు... రాములమ్మ క్లారిటీ

Monday, June 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమాల్లోకి రీఎంట్రీపై అనుమానాలు... రాములమ్మ క్లారిటీ

టాలీవుడ్ సీనియర్‌ నటి విజయశాంతి మరోసారి వెండితెరపై మెరవనున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న రాములమ్మ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. మహేశ్ సినిమాలో రాములక్క కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం విదితమే. అయితే ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రాములమ్మ రీ ఎంట్రీని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఫేస్‌బుక్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

రాములక్క రాజకీయాలను పట్టించుకోరా..!

తాను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తోందన్నారు. తాను మరలా సినీరంగ ప్రవేశం చేయడంపై కొందరు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. సినిమాల్లో నటిస్తే ఇక రాజకీయాలను పట్టించుకోరా..? అనే అనుమానం కొందరికి రావచ్చేమోనని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. తనకు నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చిందని.. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ తరఫున తనను స్టార్ క్యాంపెయినర్‌గాను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గాను ప్రచార బాధ్యతలను అప్పగించారన్నారు.

చిత్తశుద్ధితో పనిచేశా..!

"నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న కమిట్మెంట్. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తె వాళ్లు కూడా ఉన్నారు. 2014-2018 వరకు కాంగ్రెస్‌లో రాములమ్మ ఆక్టివ్‌గా లేరని కొందరు చేసే కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా నా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూ.చ తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు అనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు" అని రాములమ్మ క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ పోస్ట్‌పై అభిమానులు, కార్యకర్తలు, సినీ ప్రియులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేశ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రాములక్క ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో.. ఎలా మెప్పిస్తారో..? ఆ పాత్ర రాములమ్మకు ఏ మాత్రం సెట్ అవుతుందో..? డైరెక్టర్ ఈమె కోసం ఎలాంటి పాత్ర అల్లారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.