‘సరిలేరు..లో’ అంతుచిక్కని రాములమ్మ పాత్ర!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ అయిపోయింది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ షురూ చేసింది. కాగా సినిమాలో దాదాపు అందరి పాత్రలపై కాస్తో కూస్తో క్లూ దొరికినప్పటికీ రాములమ్మ పాత్ర ఎలా ఉంటుందనేది మాత్రం ఊహకందట్లేదు.
రాములమ్మ పాత్రేంటో!?
ఇప్పటి వరకూ లుక్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయ్ కానీ.. రాములమ్మ పాత్రపై మాత్రం చిన్నపాటి లీకులు రాకుండా చిత్రబృందం చాలా జాగ్రత్త పడుతోంది. ఇప్పటి వరకూ రాములమ్మది ప్రొఫెసర్ పాత్ర అని హైదరాబాద్‌లోని ఓ లా కాలేజీలో షూటింగ్ జరిపారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ పుకార్లేనని.. మహేశ్‌కు చాలా దగ్గరగా ఉండే పాత్రలోనే విజయశాంతి నటిస్తోందని తాజా సాంగ్‌ను బట్టి తెలుస్తోంది. మరి రాములమ్మ పాత్రేంటో తెలియాలంటే ఇప్పట్లో కష్టమే.. సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడక తప్పదేమో!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.