బీజేపీలోకి విజయశాంతి.. దసరా రోజు కాషాయతీర్థం!

  • IndiaGlitz, [Friday,September 27 2019]

తెలంగాణలో అంతంత మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగలనుందా..? కాంగ్రెస్‌కు ‘చేయి’చ్చి.. కీలకనేత అయిన విజయశాంతి అలియాస్ రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోబోతన్నారా..?ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందా..? ఇప్పటికే మంతనాలు కూడా అయిపోయాయా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని తెలుస్తోంది.

ఇప్పటికే పెద్దలంతా చేరిపోయారు!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారింది. దీంతో దీన్నే అదనుగా తీసుకున్న జాతీయపార్టీ అయిన బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తూ.. బలోపేతం కావడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటు ఏపీ నుంచి.. అటు తెలంగాణ నుంచి పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలను పార్టీలోకి రప్పించి కాషాయ కండువా కప్పేశారు కమలనాథులు.

సినిమాల్లోకి రీఎంట్రీ..!
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరిస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటరివ్వడంలో ముందుంటే విజయశాంతికి కాషాయ కండువా కప్పడానికి నేతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన రాములమ్మ.. పెద్దగా మీడియా ముందుకు రాలేదు. ఈ గ్యాప్‌లో సుమారు 13 ఏళ్ల తర్వాత.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా..మరో ఒకట్రెండు సినిమాలకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినవస్తున్నాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే..!
ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఆమెతో భేటీ అయ్యి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. రాములమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట. టీఆర్ఎస్ ధీటుగా వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమని భావించిన విజయశాంతి ఏ మాత్రం ఆలోచించకుండా ‘నేను రెఢీ’ చెప్పిందని విశ్వసనీయవర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా రోజున.. తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రాములక్క రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

మొత్తం మేమే చేశాం.. సీఎంగా జగన్ చేసిందేంటి!

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొస్తే చాలు.. అది మేమే.. ఇది మేమే ఆ ఘనత మాదే..

తొలి పార్టీగా ‘ఎంఐఎం’ ఆల్‌టైమ్ రికార్డ్!

రాజకీయ పార్టీలు రాణించాలంటే సోషల్ మీడియా ఏ విధమైన కీలకపాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా పేరులో మార్పు

`నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా` సినిమా త‌ర్వాత బ‌న్నీ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `అల‌.. వైకుంఠ‌పుర‌ములో..`.

చిరంజీవి - కొరటాల చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం ‘సైరా’ తర్వాత.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో

'సైరా' లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ

మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్ర&#