close
Choose your channels

‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ రోల్ తెలిసిపోయిందోచ్!

Wednesday, August 14, 2019 • తెలుగు Comments

‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ రోల్ తెలిసిపోయిందోచ్!

సూపర్ స్టార్‌ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం కశ్మీర్‌లో షూటింగ్‌ను ముగించుకుని హైదరాబాద్‌లో సెట్టేసింది. ఇక్కడే కొన్ని రోజుల పాటు షూటింగ్ జరగనుంది. అయితే మహేశ్ ఆర్మీ జవాన్ కావడంతో కశ్మీర్‌లో షూట్ చేయడం జరిగింది. అయితే రెండో షెడ్యూల్‌లో మాత్రం హీరోయిన్ రష్మిక, విజయశాంతికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. కాగా విజయశాంతి అలియాస్ రాములమ్మ ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత రంగంలోకి దిగి మేకప్ వేసిన విషయం విదితమే. ఇక్కడి వరకూ అంతా ఓకే విజయశాంతి పాత్రేంటి..? రాములమ్మ రోల్ కీలకమైనదా..? కాదా..? అనేది ఇండస్ట్రీలో.. సినీ ప్రియుల్లో చర్చనీయాంశమైంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాములమ్మ ఈ సినిమాలో ‘ప్రొఫెసర్’ పాత్రలో కనిపించి మెప్పిస్తుందని టాక్. అందుకే ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్శిటిలో షూటింగ్ జరుగుతోందని సమాచారం. అయితే రాములమ్మ ఇప్పటికే పలు సినిమాల్లో టీచర్, లెక్చలర్ పాత్రల్లో నటించి మెప్పించిన విషయం విదితమే. ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇస్తోంది గనుక ఏ మాత్రం మెప్పిస్తుందో..!ఇక్కడే మరో రెండు వారాల పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. అంటే మహేశ్, రష్మిక ఇద్దరూ ఈ మేడం గారి దగ్గరే చదవు నేర్చుకుంటారన్న మాట. ఆ తర్వాతే మహేశ్ ఆర్మీలో జాయిన్ అవుతారట.

మొత్తానికి చూస్తే రాములమ్మ రోల్ మాత్రం రివీల్ అయిపోయింది. అయితే ఇది ఎంతవరకు నిజమో .. అనేది తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి. ఇదిలా ఉంటే.. నల్సార్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి షిప్ట్ కానుంది. ఇక్కడ ఎక్కువగా ఫైట్స్, లవ్ ట్రాక్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz