ప్రతి షోకి 100 టికెట్లు పంపండి.. థియేటర్‌ యాజమాన్యాలకు బెజవాడ మేయర్ లేఖ, వైరల్

  • IndiaGlitz, [Friday,March 11 2022]

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో డార్లింగ్ అభిమానులు గురువారం అర్థరాత్రి నుంచి థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అందరికంటే ముందే సినిమా చూసి స్నేహితులకు రివ్యూ చెప్పేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అయితే సినిమా టికెట్ల కోసం ఏకంగా నగర మేయర్ రంగంలోకి దిగారు. ప్రతి షోకి తమకు 100 టికెట్లు పంపాలని కోరుతూ థియేటర్ యాజమాన్యాలకు లేఖలు రాశారు. ఇది ఎక్కడో విజయవాడలో జరిగింది. ‘‘విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో ప్రతి నెలా కొత్త కొత్త చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ నేతలు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందువల్ల కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి 100 టికెట్లు కార్పోరేషన్‌కు కేటాయించండి. ఆ టికెట్లకు డబ్బు కూడా చెల్లిస్తామని విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి .. నగరంలోని సినిమా థియేటర్ల యాజమాన్యానికి లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది.

More News

ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’

పంజాబ్ : పనిచేయని రియల్‌స్టార్ ప్రభావం.. ఓటమిపాలైన సోనూసూద్ సోదరి మాళవిక

పంజాబ్‌లో  సామాన్యుడి దెబ్బకు దిగ్గజ పార్టీలు విలవిలాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ  ఘన విజయం సాధించింది.

కాంగ్రెస్‌‌కు ఘోర పరాభవం : పంజాబ్‌ మిస్... యూపీలో పనిచేయని ప్రియాంక మంత్రం

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ గడిచిన కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోన్న సంగతి తెలిసిందే.

తాగుబోతన్నారు.. ఇప్పుడాయనే కాబోయే పంజాబ్ సీఎం, ‘‘జిలేబీ’’లు సిద్ధం

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు : యూపీ, ఉత్తరాఖండ్‌లలో ‘‘కమల’’ వికాసం.. పంజాబ్‌ను ఊడ్చేసిన ‘‘ఆప్’’

2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ..