సీత పాత్ర కోసం ఫైర్ బ్రాండ్ లేడీని రికమండ్ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ ?

రాబోవు రోజుల్లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పురాణ గాధ నేపథ్యం ఉన్న చిత్రాలతో కళకళలాడబోతోంది. తెలుగు దర్శకుడు గుణశేఖర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభాస్ శ్రీ రాముడిగా ఆదిపురుష్ లో నటిస్తున్నాడు. ఇక సీతా దేవి కోణంలో రామాయణం చెప్పాలని బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కథని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.

అలౌకిక దేశాయ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో లీడ్ రోల్ సీత పాత్ర కోసం క్రేజీ బ్యూటీ కరీనా కపూర్ ని సంప్రదించారని.. ఆమె 12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తనని ఎవరూ సంప్రదించలేదని కరీనా క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో సీత పాత్ర కోసం ఫైర్ బ్రాండ్ లేడి కంగనా రనౌత్ ని రికమండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంగన రనౌత్ మణికర్ణిక చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అలాగే కంగన ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది. ఈ చిత్రానికి కూడా రచయిత విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న సీత చిత్రం ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదీ చదవండి: బికినీలో 'పెళ్లిసందడి' హీరోయిన్ ఎక్స్ పోజింగ్..

తలైవి చిత్రానికి కూడా కంగనా పేరుని విజయేంద్ర ప్రసాద్ రికమండ్ చేశారట. ఇప్పుడు సీత పాత్ర కోసం మరోసారి కంగన పేరుని దర్శకుడి వద్ద ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి. కంగన అయితే ప్రాణం పెట్టి నటిస్తుందని విజయేంద్ర ప్రసాద్ నమ్ముతున్నారు.

More News

నాని వల్ల 5 సార్లు ఏడ్చా.. బాలీవుడ్ స్టార్ కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని.. ఎమోషన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఎలాంటి వేరియేషన్ తో అయినా ప్రేక్షకులని కట్టి పడేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే నాని నటనకు అంతటి క్రేజ్ ఉంది

సెక్స్ కి కూడా వెనకాడరా.. ఎంత ఘోరం, ఫ్యామిలీ మ్యాన్ 2పై భగ్గుమంటూ..

ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే..

బికినీలో 'పెళ్లిసందడి' హీరోయిన్ ఎక్స్ పోజింగ్.. 53 ఏళ్ల వయసులో ఇలా..

స్వప్నసుందరి అంటూ 'పెళ్లి సందడి'లో సందడి చేసిన దీప్తి భట్నాగర్ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.

తన పెట్ తో ముంబయిలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన రష్మిక!

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.

షాకింగ్: రూ.150 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్.. నో ఎందుకు చెప్పాడంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరింది.