షూటింగ్‌లో గాయపడ్డ విక్కీ

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

చాలా మంది హీరోలు తమ సినిమాలు సహజంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ఎంత రిస్కయినా తీసుకోవడానికి సిద్ధపడతారు. ఎంతో కష్టతరైమెన యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా డూప్ లేకుండా స్వయంగా చేయుడానికి సాహసిస్తారు.అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు హీరోలు గాయాల పాలు కావడం మనం చూస్తుంటాం. తాజాగా అలాంటి ఘటన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ విషయంలో జరిగింది.

‘యురి’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న విక్కీ ప్రస్తుతం ఓ గుజరాతీ సినిమాలో నటిస్తున్నారు. భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమ‌యంలో ఒక భారీ డోర్ అతని మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దవడ ఎముక విరగడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత అతని ముంబాయి తీసుకెళ్ళారు. చికిత్సలో భాగంగా విక్కీకి 13 కుట్లు పడినట్టు తెలుస్తోంది.