4 ఏళ్ల తరువాత విక్రమ్ డబుల్ ధమాకా

  • IndiaGlitz, [Friday,October 09 2015]

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ.. త‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌తో ఆకట్టుకున్న త‌మిళ క‌థానాయ‌కుడు విక్ర‌మ్‌. తెలుగులోనూ త‌న‌కంటూ ఓ మార్కెట్‌ని సొంతం చేసుకున్న విక్ర‌మ్ ఈ ఏడాది ఆరంభంలో 'ఐ' సినిమాతో ప‌ల‌క‌రించాడు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. త‌న పాత్ర కోసం విక్ర‌మ్ తీసుకున్న శ్ర‌ద్ధ‌, క‌ష్ట‌ప‌డిన తీరు సినిమా ప్రియుల మ‌న్న‌న‌లు పొందింది. ఈ ఉత్సాహంతోనే త‌న త‌దుప‌రి చిత్రం '10 ఎండ్ర‌త్తుకుల్ల' ని శ‌ర‌వేగంగా పూర్తిచేశాడు విక్ర‌మ్. ఈ సినిమా ఈ నెల 21న విడుద‌ల కానుంది. తెలుగులోనూ అదే తేదికి ఈ సినిమా అనువాద రూపంలో రావ‌చ్చు లేదంటే వాయిదా ప‌డొచ్చు.

ఏదీఏమైనా ఒకే ఏడాదిలో ఇలా రెండేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌డం విక్ర‌మ్ అభిమానుల‌కు మాత్రం సంతోష‌క‌ర‌మైన అంశ‌మే. కెరీర్ ప్రారంభంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు సైతం చేసుక‌పోయిన విక్ర‌మ్‌.. ఈ మ‌ధ్య కాలంలో ఏడాదికి ఒక‌టి లేదా రెండేళ్ల‌కు ఒక‌టి అన్న‌ట్లుగా త‌న సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తున్నాడు. 2011లో 'దైవ‌తిరుమ‌గ‌ళ్' (నాన్న‌), 'రాజాపాట్టై' (వీడింతే) సినిమాల కోసం డ‌బుల్ ధ‌మాకా ఇచ్చిన విక్ర‌మ్ మ‌ళ్లీ నాలుగేళ్ల త‌రువాత ఆ ఫార్ములాని రిపీట్ చేస్తున్నాడు.

More News

కళ్యాణ్ రామ్ హీరోయిజానికి 12 ఏళ్లు..

2015..పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది.అయితే ఈ సంవత్సరంలో ఈ బ్లాక్ బస్టర్ అనే పదానికి శ్రీకారం చుట్టిన సినిమా మాత్రం 'పటాస్'.

మొన్న మహేష్..నిన్న ఎన్టీఆర్..నేడు చరణ్..

యాక్షన్ కి కామెడీని మిక్స్ చేయడంలో శ్రీనువైట్లది అందెవేసిన చెయ్యి.అందుకే తన కెరీర్ లో విజయాల శాతం ఎక్కువ. గతేడాది 'ఆగడు'తో పరాజయం ఎదురైనప్పటికీ..

రుద్రమదేవి మూవీ రివ్యూ

రుద్రమదేవి..తెలుగు జాతి చరిత్రను, సంస్కృతిని దేశవిదేశీయులకు తెలియజేసిన గొప్ప సామ్రాజ్ఞి. కాకతీయవంశానికి చెందిన వీరనారి రుద్రమ. పాఠశాలల్లోనూ విద్యార్థులు చదువుకునేంత గొప్ప స్ఫూర్తిమంతమైన ఆమె కథను వెండితెరపై ఆవిష్కరించాలని ఉందని గుణశేఖర్ తన అభిలాషను

చిరు150వ సినిమా గురించి బన్ని అలా అన్నాడా..?

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి అటు అభిమాలు..ఇటు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రుద్ర‌మ‌దేవికి పాజిటివ్ టాక్..

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి.