విక్రమ్-సమంతల '10' డిసెంబర్ 15న విడుదల

  • IndiaGlitz, [Wednesday,December 06 2017]

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం '10 ఎండ్రాతుకుల్ల'.

విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '10' పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి మాట్లాడుతూ.."విక్రమ్ క్యారెక్టరైజేషన్, సమంత ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణలుగా విడుదలవుతున్న మా '10' చిత్రం మాస్ ఆడియన్స్ తోపాటు క్లాస్ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. డిసెంబర్ 15న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం" అన్నారు.

More News

'సైరా న‌ర‌సింహారెడ్డి' షూటింగ్ ప్రారంభం

అటు అభిమానులు..ఇటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న‌ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' బుధ‌వారం అధికారికంగా సెట్స్ కు వెళ్లింది.

మ‌ల‌యాళ రీమేక్‌లో క‌ళ్యాణ్ రామ్‌

నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. ప్ర‌స్తుతం ఎం.ఎల్.ఎ. సినిమాలో నటిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని రూపొందిస్తున్న చిత్రం ఇది. గతంలో 'ఆగడు', 'బ్రూస్ లీ' వంటి చిత్రాలకు ఉపేంద్ర ర‌చ‌యిత‌గా పనిచేసారు.

రిపబ్లిక్ డే రోజు '2.O' టీజర్!

సూపర్ స్టార్ రజనీ కాంత్, ఏస్‌ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా '2.O'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. ప్రస్తుతం   పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

నిజాయితీతో చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు - స‌ప్త‌గిరి

క‌మెడియిన్ సప్త‌గిరి హీరోగా న‌టిచిన చిత్రం 'స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి'. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాల‌కృష్ణ చిత్రానికి సీక్వెల్‌?

న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు సీక్వెల్ చిత్రాల్లో న‌టించ‌లేదు. ఆ మ‌ధ్య ఆదిత్య 369కి సీక్వెల్‌గా తెర‌కెక్కే చిత్రంలో ఆయ‌న న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.