అది ఇంకొక్క‌డు తో నెర‌వేరింది - విక్ర‌మ్

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు, ఐ...ఇలా విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన విక్ర‌మ్ న‌టించిన తాజా చిత్రం ఇంకొక్క‌డు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ ముంద‌కు వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా హీరో విక్ర‌మ్ మాట్లాడుతూ...నేను ఎప్ప‌టి నుంచో విల‌న్ గా న‌టించాలి అనుకుంటున్నాను. కానీ...కుద‌ర‌లేదు.

అయితే...ఈ సినిమాలో ల‌వ్ అనే క్యారెక్ట‌ర్ చేయ‌డంతో విల‌న్ గా చేయాల‌నే నా క‌ల నెర‌వేరింది. విల‌న్ ఎంత బ‌లం ఉంటే సినిమా అంత బాగుంటుంది. ఇంకొక్క‌డు సినిమాలో నేను అనుకున్న బ‌ల‌మైన విల‌న్ క్యారెక్ట‌ర్ చేసాను.ల‌వ్ అనే ఈ క్యారెక్ట‌ర్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్ ఆడియోన్స్ ని బాగా ఆక‌ట్టుకుంటుంది అంటూ త‌న క‌ల నెర‌వేరినందుకు సంతోషం వ్య‌క్తం చేసాడు విక్ర‌మ్.

More News

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల ఇజం టీజర్‌కు 1 మిలియన్‌ వ్యూస్‌

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నపవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇజం. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై  నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల‌ 5న పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు.

ఇంకొక్క‌డు సెన్సార్ పూర్తి

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`.

అభినేత్రి సెంటిమెంట్ అదిరింది..!

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎ.ఎల్. విజ‌య్ తెర‌కెక్కించిన విభిన్న క‌థాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, బ్లూ స‌ర్కిల్ కార్పోరేష‌న్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'గౌతమిపుత్ర శాతకర్ణి' రాజసూయ యాగం మొదలైంది

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'.