కొత్త సినిమాతో విక్రమ్ కి పాత రోజులు

  • IndiaGlitz, [Monday,October 12 2015]

విక్ర‌మ్ సినిమాలంటే కేవ‌లం ప్ర‌యోగాత్మ‌క‌మే అనుకుంటే పొర‌పాటు. మాంచి మాస్ మూవీస్ కూడా త‌న ఖాతాలో ఉన్నాయి. విక్ర‌మ్ కి తెలుగులో మార్కెట్ ఏర్ప‌డ‌క‌ముందు.. ఆయ‌న న‌టించిన మాస్ మూవీస్ ఇక్క‌డ రీమేక్ రూపంలో తెర‌కెక్కాయి కూడా.

విక్ర‌మ్ న‌టించిన 'దిల్' సినిమా 'శ్రీ‌రామ్' పేరుతోనూ.. 'ధూల్' సినిమా 'వీడే' పేరుతోనూ.. 'సామి' సినిమా 'ల‌క్ష్మీ న‌ర‌సింహ' పేరుతోనూ పున‌ర్నిర్మిత‌మ‌య్యాయి. అయితే 'శివ‌పుత్రుడు, అప‌రిచితుడు' చిత్రాల‌తో ఇక్క‌డా పేరు రావ‌డంతో ఆయ‌న సినిమాలు అనువాద రూపంలో ఇక్క‌డివారి ముందుకు వ‌చ్చాయి. ఈ టైం నుంచే విక్ర‌మ్ కెరీర్‌లో ఎక్స్‌ప‌రిమెంట‌ల్ మూవీస్ ఎక్కువ‌య్యాయి. గ‌త చిత్రం 'ఐ' కూడా ఆ త‌ర‌హా చిత్ర‌మే.

ఈ నేప‌థ్యంలో కొత్త చిత్రం '10 ఎండ్ర‌త్తుకుల్ల' మాత్రం కంప్లీట్ ఎక్స్‌ప‌రిమెంట‌ల్ మూవీ అయితే కాద‌ని.. గ‌తంలో త‌ను చేసిన 'దిల్‌, ధూల్' త‌ర‌హాలో మాస్‌ని టార్గెట్ చేసుకున్న సినిమా అని విక్ర‌మ్ చెప్పుకొస్తున్నాడు. కొత్త సినిమాతో విక్ర‌మ్‌కి పాత రోజులు రావాల‌ని ఆశిద్దాం.

More News

'బ్రూస్ లీ ద ఫైటర్' సెన్సార్ పూర్తి...

రామ్ చరణ్,సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల లతో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి ''డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.'' పతాకం పై శ్రీమతి డి.పార్వతి సమర్పణలో నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం‘బ్రూస్ లీ ద ఫైటర్’.

కళ్యాణ్ రామ్ షేర్ ఆడియో రిలీజ్ విశేషాలు..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహన్ నటించారు. ఈ చిత్రాన్ని విజయలక్ష్మి పిక్చర్స్ పతాకం పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఊటీలో 'బ్రహ్మోత్సవం'?

'శ్రీమంతుడు'.. మహేష్ బాబు కి కొత్త ఉత్సాహాన్నిచ్చిన చిత్రమిది. 80 కోట్లకి పైగా షేర్ పొందిన ఈ సినిమా విజయంతో.. మహేష్ తన కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం'ని మరింత జనరంజకంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

'సర్దార్' దీ 'గబ్బర్ సింగ్' రూటేనా?

'గబ్బర్సింగ్'.. పవన్ కళ్యాణ్ కిబ్లాస్ బస్టర్ హిట్ ని చాన్నాళ్ల తరువాత అందించిన సినిమా ఇది. 2012 సమ్మర్ లో విడుదలై.. సంచలన విజయం సాధించింది ఈ మూవీ. పవన్ వన్ మేన్ షోగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం అంటే అభిమానులకు ఎంతో స్పెషల్.

'బ్రూస్ లీ'లోనూ ఆ సీన్ ఉంటుందా?

శ్రీనువైట్ల సినిమాలంటే వినోదానికి పెట్టింది పేరు. అయితే 'ఆనందం' నుంచి వైట్ల సినిమాల్లో వినోదం కోసం ఏ సీన్లు రిపీట్ చేసినా.. చేయకపోయినా ఓ సీన్ మాత్రం కంపల్సరీ.