close
Choose your channels

విక్ర‌మ్ 'కోబ్రా' ఫ‌స్ట్ లుక్‌... 7 గెట‌ప్స్‌

Saturday, February 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ర‌మ్ `కోబ్రా` ఫ‌స్ట్ లుక్‌...7 గెట‌ప్స్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా `కోబ్రా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్`(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కె.జి.య‌ఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. లేటెస్ట్‌గా ఎస్‌.ఎస్‌.ల‌లిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో 7 గెట‌ప్స్‌ను రివీల్ చేశారు. అయితే పాత్ర ప‌రంగా, లుక్ పరంగానూ కొత్తగా చూపించే ప్రయత్నం చేసే నటుల్లో ఒక‌డైన విక్ర‌మ్ ఈ సినిమాలో 25 గెట‌ప్స్‌లో క‌నిపించ‌బోతున్నార‌ని టాక్‌. అందులో ఇప్పుడు 7 గెట‌ప్స్ మాత్ర‌మే విడుద‌లైయ్యాయంటున్నారు. ఈ లుక్స్ కోసం అమెరికన్ కంపెనీ ఒకటి వర్క్ చేస్తుంది.

ఈ సినిమాతో పాటు విక్ర‌మ్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలోనూ న‌టిస్తున్నారు. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం వేచి చూస్తున్న విక్ర‌మ్ ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. తెలుగు నిర్మాత‌లు ఈ సినిమా తెలుగు హ‌క్కుల కోసం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో ఓ క్లారిటీ రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.