close
Choose your channels

‘ల‌వ్‌స్టోరి’ కోసం విలేజ్ సెట్‌

Tuesday, August 11, 2020 • తెలుగు Comments

‘ల‌వ్‌స్టోరి’ కోసం విలేజ్ సెట్‌

తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్ని దోచుకున్న సాయిప‌ల్లవి త‌ర్వాత ఏంసీఏ, క‌ణం త‌దిత‌ర చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అలాగే త‌మిళంలోనూ కొన్ని సినిమాల్లోనూ న‌టించింది. ఇప్పుడు తెలుగులో రానా ద‌గ్గుబాటి జ‌త‌గా విరాట‌ప‌ర్వం సినిమాలో న‌టిస్తుంది. దీనికంటే ముందుగా నాగ‌చైత‌న్య జోడీగా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌లో ప‌దిహేను రోజుల్లో చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ పార్ట్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇందులో ఓ పాట‌ను కూడా చిత్రీక‌రించాల్సి ఉంది.

లేటెస్ట్ స‌మాచారం కోసం శేఖ‌ర్ క‌మ్ముల ఓ విలేజ్ సెట్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేశార‌ట‌. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌నులు మొద‌ల‌య్యాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విలేజ్ సెట్‌లో సాంగ్, కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అక్టోబ‌ర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ ఏడాదిలోపే షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz