'విశ్వామిత్ర' విల‌న్‌గా..

  • IndiaGlitz, [Monday,July 02 2018]

'గీతాంజలి' లాంటి కామెడీ హారర్‌తో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన‌ దర్శకుడు రాజ్ కిరణ్. ప్ర‌స్తుతం ఈ దర్శకుడు.. ‘విశ్వామిత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు ప్రసన్న, నందితా రాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

ఈ షెడ్యూల్‌లో ప్రసన్న, నందితపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్‌లో ఈ నెల 12నుంచి నెలాఖరు వరకు జరగబోయే తదుపరి షెడ్యూల్‌లో ప్ర‌ముఖ న‌టుడు అశుతోష్ రాణా కూడా పాల్గొంటున్నట్టు సమాచారం.

ఈ సినిమా గురించి దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నందిత ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా నటిస్తోంది. మగవాళ్ళంటే అసలు పడని ఈ అమ్మాయికి.. ఆమె పనిచేసే కంపెనీలో బాస్‌గా అశుతోష్ రాణా నటిస్తున్నాడు.

తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తూనే, విలన్‌గాను మెప్పించే విధంగా అశుతోష్ పాత్ర ఉంటుంద‌”ని తెలిపారు. అలాగే.. యుఎస్, స్విట్జర్‌ల్యాండ్‌లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ థ్రిల్లర్ మూవీను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.

కిరణ్, మాధవి అద్దంకి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యుల్లేఖా రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

More News

విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ప్రారంభం

హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో అంద‌రినీ మెప్పించే ప్యూర్ ల‌వ్ స్టోరీ 'తేజ్ ఐ ల‌వ్ యు' - సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

తండ్రి టైటిల్‌తో నాగ్ మల్టీస్టారర్ మూవీ?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆగష్టు 24న‌.. విక్ర‌మ్ చిత్రం

'సామి'.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. 2003లో హరి దర్శకత్వంలో

గోపీచంద్‌.. ఏడోసారి

'తొలివలపు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ తర్వాత 'జయం', 'నిజం' సినిమాలలో విలన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.