close
Choose your channels

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

Tuesday, April 23, 2019 • తెలుగు Comments

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

'సూత్రధార్' యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మ.. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలంటూ యువతులను వేధించిన సంగతి తెలిసిందే. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు మంగళవారం సాయంత్రం వినయ్‌ను అరెస్ట్ చేశారు.

గత వారం రోజులుగా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. వినయ్ వర్మపై 354 A (నిర్భయ యాక్ట్) 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ తరలించారు.

అయితే.. యువతిని బట్టలు విప్పమంది నిజమే కానీ పై దుస్తులు మాత్రమేనని వినయ్ బుకాయించాడు. తనపై ఫిర్యాదు చేసిన యువతికి డ్యాన్స్‌ అంటే ఇంట్రస్ట్ లేదని అందుకే తనపై ఆరోపణలు చేసి ఇలా చేసిందన్నాడు. తాను ఎంతో ఎంతోమందిని హీరో, హీరోయిన్లు, నటులుగా తీర్చిదిద్దానట్లు చెప్పుకొచ్చాడు.

కాగా.. శిక్షణ కోసం వచ్చిన తొమ్మిది మంది యువతులతో వినయ్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో జనాలంతా ముక్కున వేలేసుున్నారు. అయితే తాజాగా ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుసుకున్న బాధితులు, ప్రజలు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz