పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో 'విన‌య విధేయ రామ‌'... సంక్రాంతి విడుద‌ల‌

  • IndiaGlitz, [Friday,December 14 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుత‌న్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య మాట్లాడుతూ - 'విన‌య‌విధేయ రామ' టాకీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. నేటి నుండి చిత్రీక‌రించ‌బోయే షెడ్యూల్‌లో రెండు సాంగ్స్ షూట్ చేయ‌బోతున్నాం. ఈ నెల 26 వ‌ర‌కు జ‌రిగే ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణతో సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మ‌రో ప‌క్క నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. సినిమా ఔట్ పుట్ అద్భుతంగా వ‌చ్చింది. ప్ర‌స్తుతం చేస్తోన్న రెండు సాంగ్స్‌లోఓ స్పెష‌ల్ సాంగ్‌ను కూడా చిత్రీక‌రించ‌బోతున్నాం. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా న‌ర్తిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ఓ సాంగ్ సోష‌ల్ మీడియా, యూ ట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే డిసెంబ‌ర్ 17న త‌స్స‌దియ్యా... అనే సాంగ్‌ను కూడా విడుద‌ల చేయ‌బోతున్నాం. మెగాభిమానులు సినిమాపై ఎన్ని అంచ‌నాల‌తో ఎదురుచూస్తున్నారో తెలుసు. వారి అంచ‌నాల‌ను మించేలా సినిమాను డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుగారు తెర‌కెక్కించారు. ఈ సంక్రాంతి మెగాభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు మా విన‌య విధేయ రామ చిత్రం క‌నువిందు చేస్తుంది అన్నారు.

రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి మాట‌లు: య‌ం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీ: రిషి పంజాబి, ఆర్థ‌ర్ ఎ.విల్స‌న్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్‌కుమార్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డి.క‌ల్యాణ్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను.

More News

శర్వానంద్,సాయిపల్లవి ల 'పడి పడి లేచే మనసు' ట్రైలర్ లాంచ్ వేడుక..

శర్వానంద్ , సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'పడి పడి లేచే మనసు'.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ అవుతుంది..

హీరోయిన్ లేకుండా కార్తి సినిమా.. 

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో కార్తి త్వ‌ర‌లోనే 'దేవ్' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు త‌న కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

శ్రీదేవి పాత్ర‌ పై షారూక్ స్పంద‌న‌..

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్, ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'జీరో'. అనుష్క శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్ న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

మురుగ‌దాస్ అభ్య‌ర్థ‌న‌ పై విచార‌ణ వాయిదా

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితంగా ప్ర‌భుత్వం వ‌స్తువుల‌ను ఇవ్వ‌డాన్ని త‌ప్పుగా చూపిస్తూ స‌ర్కార్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని జి.దేవ‌రాజ్ అనే వ్య‌క్తి కేంద్ర క్రైం బ్రాంచ్‌కి పిర్యాదు చేశాడు.

జ‌య‌ల‌లిత మ‌రో బ‌యోపిక్ వివ‌రాలు...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, అన్నా డీఎంకే అధ్య‌క్షురాలు జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర సినిమా రూపంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి కాదు.. ఏకంగా మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి.