'విఐపి2' టీజర్ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,June 05 2017]

ధ‌నుష్ హీరోగా సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను వి.ఐ.పి2 చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుండ‌టం విశేషం. అప్పుడెప్పుడో మెరుపు క‌ల‌లు సినిమాతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కాజోల్ ఆ తర్వాత హిందీ సినిమాల‌తో బిజీగా మారింది. త‌ర్వాత మ‌రే ద‌క్షిణాది సినిమాలోనూ యాక్ట్ చేయ‌లేదు.

దాదాపు రెండు ద‌శాబ్దాలు త‌ర్వాత కాజ‌ల్ మ‌రోసారి ద‌క్షిణాది సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమాను జూలై 14న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను జూన్ 7న ఒకేసారి తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేయ‌బోతున్నారు. విఐపి2 ముందు భాగం ర‌ఘ‌వ‌ర‌న్ బి.టెక్ మంచి విజ‌యం సాధించ‌డంతో విఐపి2పై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి తెలుగులో ఈ చిత్రాన్ని ఎవ‌రు కొని విడుద‌ల చేస్తారో చూడాలి.

More News

డి.రామానాయకుడు జయంతి సందర్భంగా విడుదలకానున్న 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్

జూన్ 6వ తేదీ దగ్గుబాటి వంశీయులకు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకమైన రోజు.

హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు...

మైనింగ్ మాఫియా కేసులో జైలు పాలైన బళ్ళారి గాలి జనార్ధన్ రెడ్డి సినిమా

కాలాలో మరో సూపర్ స్టార్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మాత గా పా రంజిత్ దర్శకత్వంలో

మంత్రి తలసాని చేతుల మీదుగా 'ఖయ్యుంభాయ్ ' ఫస్టు లుక్ పోస్టర్ ఆవిష్కరణ

గ్యాంగ్ స్టర్ న యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-'ఖయ్యుం భాయ్'

'అవంతిక' చిత్రంతో రామసత్యనారాయణ పెద్ద నిర్మాత అవడం ఖాయం - కొణిజేటి రోశయ్య

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా భీమవరం టాకీస్ బేనర్పై కె.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో