వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్

  • IndiaGlitz, [Friday,May 28 2021]

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ప్రత్యేకం. దాదాపు దశాబ్దానికి పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగని హద్దులు దాటే గ్లామర్ ఒలకబోయలేదు. నటన, గ్లామర్ తో కాజల్ ప్రతి ఒక్కరిని మెప్పించింది. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కాజల్ ఆడి పాడింది.

ఇప్పటికి కాజల్ బిజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. గత ఏడాది కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని బ్యాలన్స్ చేస్తూ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

లేటెస్ట్ గా కాజల్ తన భర్తతో రొమాంటిక్ మూడ్ లో ఉన్న పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇద్దరూ క్యాజువల్ డ్రెస్ లలో ఉన్నారు. కాజల్ ని గౌతమ్ హత్తుకుని ఉండగా ఇద్దరూ స్టెప్స్ పై రొమాన్స్ లో ఉన్నారు. భర్త తనకు ముద్దు పెడుతున్న పిక్ కూడా కాజల్ పోస్ట్ చేసింది.

సినిమాల విషయానికి వస్తే కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కేసులు తగ్గాక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

More News

ఎన్టీఆర్ కి భారతరత్న.. మెగాస్టార్ ఎలా డిమాండ్ చేశారో చూడండి

నేడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని,

ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌‌కు నివేదిక..

కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఆయుష్ తన విచారణను పూర్తి చేసి పాజిటివ్ నివేదికనే ఇచ్చింది.

దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి.