close
Choose your channels

వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..

Tuesday, June 1, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైరల్: రామ్ పోతినేని క్రేజీ న్యూలుక్ అదిరిందిగా..

ఎనెర్జిటిక్ హీరో రామ్ పోతినేని మాస్ చిత్రాలతో అలరిస్తూనే కొత్తదనం ఉన్న కథలకూ ప్రాధాన్యత ఇస్తాడు. రామ్ ప్రతి చిత్రంలో తన లుక్ విషయంలో కేర్ తీసుకుంటాడు. ఇస్మార్ట్ శంకర్ లో మాస్ లుక్ లో అలరించాడు. రెడ్ లో పాత్రకు తగ్గట్లుగా షార్ట్ హేర్ తో కనిపించాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రామ్ అన్ని విషయాలని అభిమానులతో పంచుకుంటుంటాడు. సినిమాలు మాత్రమే కాదు అవసరమైనప్పుడు సామజిక అంశాల గురించి కూడా రామ్ గళం విప్పుతుంటాడు. లుక్ విషయంలో ఎప్పుడూ ఆశ్చర్యపరిచే రామ్ తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇదీ చదవండి: బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్

తన ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ పోస్ట్ చేశాడు. ఈ పిక్ లో రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. గడ్డంతో పాటు, హేర్ కూడా బాగా పెంచుతున్నాడు. రామ్ తన నెక్స్ట్ మూవీ కోసం మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

రామ్ మార్నింగ్ కాఫీ తాగుతూ కూల్ గా ఈ సెల్ఫీ తీసుకున్నాడు. రామ్ నెక్స్ట్ మూవీ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఉండబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు రానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.