close
Choose your channels

రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేశాడా ? వీడియో వైరల్

Tuesday, May 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెలెబ్రిటీల మధ్య ఎఫైర్ స్టోరీలు అల్లేయడానికి నెటిజన్లకు చిన్న అవకాశం దొరికినా చాలు. అది నిజామా, అబద్దమా, మ్యాటర్ ఏంటి.. ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం షురూ చేసేస్తారు. ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కూడా ఇందుకు అతీతం కాదు.

Also Read: తెలుగు హీరోల బిరుదులు.. ఎలా మారాయో తెలుసా?

వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న పుకార్లు కొత్త కానప్పటికీ తాజాగా మరోమారు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. విజయ్ దేవరకొండ రష్మికకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ మోకాళ్లపై కూర్చుని రష్మికకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.

ఇంకేముంది నెటిజన్లు ఈ వీడియోని వైరల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. విజయ్, రష్మిక ఓ కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారు. ఆ వీడియో కొంత భాగం బయటకు వచ్చింది. యాడ్ షూట్ లో భాగంగానే విజయ్ రష్మికకు ప్రపోజ్ చేస్తున్నాడు. అంతే కానీ ఇదేదో ఎఫైర్ వ్యవహారం కాదు.

ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరూ క్రేజీ సెలెబ్రిటీలు. రష్మిక బిగ్ స్టార్స్ సరసన ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో లైగర్ మూవీలో నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.