విశాల్ 'అభిమన్యుడు' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Sunday,November 26 2017]

మాస్‌ హీరో విశాల్‌ ఇటీవల విడుదలైన 'డిటెక్టివ్‌'తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'అభిమన్యుడు'. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అలరిస్తారు. మాస్‌ హీరో విశాల్‌ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు విశాల్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఆదివారం ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ''అభిమన్యుడు' ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశాం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా, బడ్జెట్‌ విషయంలో అన్నింటిలోనూ హై రేంజ్‌లో వుంటుంది. హీరోగా, నిర్మాతగా నేనెంతో ఇష్టపడి చేస్తున్న సినిమా 'అభిమన్యుడు'. దర్శకుడు మిత్రన్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీస్తున్నారు. అర్జున్‌గారు చేస్తున్న క్యారెక్టర్‌ చాలా విభిన్నంగా వుంటుంది. బడ్జెట్‌ పరంగా ఎలాంటి లిమిట్స్‌ లేకుండా హై క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నా కెరీర్‌లో ఈ సినిమా వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ 27న చాలా గ్రాండ్‌గా ఆడియోను రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.

మాస్‌ హీరో విశాల్‌, సమంత, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: రూబెన్‌, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, ఆర్ట్‌: ఉమేష్‌ జె.కుమార్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, నిర్మాత: విశాల్‌, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌.

More News

'సైరా' నుండి తప్పుకున్న రెహమాన్

ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహా రెడ్డి` సినిమా ఉంటుందని ముందు యూనిట్ ప్రకటించింది. అయితే ఒక్కొక్క టెక్నిషియన్ సినిమా నుండి తప్పుకుంటున్నారు.

'ఖాకి'కి శంకర్ అభినందన

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం `ఖాకి`. హెచ్.వినోద్ దర్శకత్వంలోరూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆదిత్యమ్యూజిక్ రిలీజ్ చేసింది. 1995-2005లో నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

నాని.. ఫిబ్రవరి సందడి

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నారు. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

రామ్ చరణ్ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్ఎల్ బి' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్ప్రెస్' వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'అనగనగా ఓ ప్రేమకథ' ప్రారంభం

కె. ఎల్.ఎన్ రాజు నిర్మాతగా.. థంజౌడ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్పై కొత్త చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.