ఈనెల 27న విశాల్‌ 'అయోగ్య' తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

  • IndiaGlitz, [Monday,July 08 2019]

విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన చిత్రం 'అయోగ్య'. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్‌ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించింది. 'ఠాగూర్‌' మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్‌ మూవీస్‌ అధినేత ప్రశాంత్‌ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 27న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్‌ చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రశాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. 'అయోగ్య' తమిళంలో ఘనవిజయం సాధించింది. అక్కడా బాక్సాఫీస్‌ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. తమిళ క్రిటిక్స్‌ సైతం ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్రశంసలు కురిపించారు. విశాల్‌ ఎనర్జీ లెవల్‌ని పదింతలు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌. తమిళనాడులో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా పతాక సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దారు. తమిళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్‌ మూవీస్‌ ద్వారా రిలీజ్‌ చేస్తుండడం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్‌ నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలోనే 'అయోగ్య' ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈనెల 27న ఏపీ, నైజాంలో రిలీజ్‌ చేస్తున్నామని తెలిపారు.

More News

జులై 19న 'మిస్ట‌ర్ కెకె' రిలీజ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో

చార్మి డిస్కౌంట్ ఇస్తానంటోంది

చార్మింగ్ చార్మి డిస్కౌంట్ ఇస్తానని అనాలేగానీ, కుర్ర‌కారు ఎగ‌బ‌డ‌కుండా ఉంటారా? త‌మ‌కు న‌చ్చింది చేజిక్కించుకోకుండా ఉంటారా?

సమంతకు బన్నీ గిఫ్ట్

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మ్యూచువ‌ల్ అప్రిషియేష‌న్ చాలా కామ‌న్ అయిపోయింది. ఎవ‌రి సినిమా బాగా ఉన్నా స‌రే, వెంట‌నే మిగిలిన‌వారు దాని గురించి నాలుగు మంచి మాట‌లు చెప్ప‌డానికి వెన‌కాడ‌టం లేదు.

లీకైన మహేష్ బాబు ఫొటోలు

మ‌హేష్ తాజా సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` స్టిల్ లీక‌య్యింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జ‌రుగుతోంది.

అల్లు వారి రామాయ‌ణం

వాల్మీకి రామాయ‌ణానికి ఆ త‌ర్వాతి కాలంలో చాలా వెర్ష‌న్లు వ‌చ్చాయి. వీడియో రూపంలోనూ రామాయ‌ణ‌గాథ‌లు అల‌రించాయి.