close
Choose your channels

దీపావళికి విశాల్‌.. ఓటీటీలోనే..!

Friday, September 18, 2020 • తెలుగు Comments

దీపావళికి విశాల్‌.. ఓటీటీలోనే..!

హీరో, నిర్మాత విశాల్‌ లేటెస్ట్ మూవీ చక్ర. దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'చక్ర' సినిమాను విడుదల చేయడానికి విశాల్‌ సన్నాహాలు చేసుకున్నారు. బ్యాంక్‌ రాబరీ, ఆన్‌లైన్‌ మోసాలు అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆనంద్‌ దర్శకుడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ముందుగా ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో ఓటీటీలోనే నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారట. వివరాల మేరకు చక్ర సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేస్తారని అంటున్నారు.

ఈ చిత్రంలో రెజీనా కసండ్ర విలన్‌గా నటిస్తుందని టాక్‌. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. అభిమన్యుతో హిట్‌ కొట్టిన విశాల్‌కు 'యాక్షన్‌' మూవీ నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు విశాల్‌ చక్ర మూవీతో ఈ ఏడాది దీపావళికి సందడి చేయబోతున్నారు. అలాగే తదుపరి చిత్రంగా విశాల్‌ 'డిటెక్టివ్‌ 2' విడుదలకు సన్నద్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. 'డిటెక్టివ్‌'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి హీరోగా, నిర్మాతగానే కాదు.. దర్శకుడిగానూ విశాల్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం యు.కెలోనే చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz