విశాల్ 'విలన్' లుక్ అదిరిందిగా...

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ విల‌న్‌గా క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిందే. మ‌రో విష‌య‌మేమంటే విశాల్ ఈ సినిమాలో డాక్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌. బబ్లీ బ్యూటీ హ‌న్సిక విశాల్ క్లాస్ మేట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే తెర‌పై విల‌న్స్‌ను చిత‌గొట్టిన విశాల్ తొలిసారి విల‌న్‌గా చేయ‌నుండం సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన విశాల్ లుక్‌ను విడుద‌ల చేశారు. సినిమాకు 'విల‌న్‌' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే 'విల‌న్' అనే పేరులో వి అక్ష‌రం త‌మిళంలో ల అక్ష‌రం తెలుగులో న్ అక్ష‌రం మల‌యాళంలో ఉంది. మ‌రి విశాల్ పాత్ర ఇంకెంత కొత్త‌గా ఉంటుందో మ‌రి. ఉన్ని కృష్ణ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా విశాల్ మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు.

More News

'2.0' ప్రమోషన్స్ స్టార్ట్...

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైంటిఫికల్ విజువల్ వండర్ '2.0'.

నాని మూవీలో బాలీవుడ్ నటుడు...

వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో

'జయదేవ్'తో గంటా రవికి గ్రేట్ ఫ్యూచర్ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

గంటా రవి హీరోగా పరిచయం చేస్తూ మాళవికా రాజ్ హీరోయిన్ గా డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో

జూలై 7న 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' గ్రాండ్ రిలీజ్

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు.

28 శాతం జీఎస్టీ పై ధ్వజ మెత్తిన టీ-ఫిలించాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షడు ఆర్.కె గౌడ్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫిలిం ఇండస్ర్టీ పై 28శాతం జీఎస్ టీ విధిస్తు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.