'పందెంకోడి 2' భారీ డీల్‌

  • IndiaGlitz, [Friday,July 13 2018]

13 ఏళ్ల త‌ర్వాత విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు.

అయితే 'పందెంకోడి 2' అని పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని విశాల్ ఆలోచిస్తున్నాడు.

త‌మిళంలో విశాల్ ఫిలిమ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై విశాల్ సినిమాను విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పందెంకోడి సినిమా పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి ఈ సీక్వెల్‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు ప‌దికోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం వెలువ‌డ నుంది.

More News

రూమ‌ర్స్‌ పై ద‌ర్శ‌కుడి వివ‌ర‌ణ‌...

బ‌లుపు, డాన్‌శీను చిత్రాల‌తో స‌క్సెస్ కొట్టిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని త‌దుప‌రి సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

హిందీ సినిమా గురించి నాగ్ ఏమ‌న్నాడంటే..

దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత అక్కినేని నాగార్జున హిందీ సినిమా 'బ్ర‌హ్మాస్త్ర‌'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2003క‌లో 'ఎల్‌.ఒ.సి కార్గిల్'  త‌ర్వాత నాగ్ న‌టిస్తున్న హిందీ చిత్ర‌మిది.

 'వీర భోగ వసంత రాయలు' ఫస్ట్ లుక్ రిలీజ్

నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కాంబినేష‌న్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం వీర భోగ వసంత రాయలు. ఈ చిత్రాన్ని బాబా క్రియేష‌న్స్ ప‌తాకం

'దేవ‌దాస్' రిలీజ్ డేట్‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

కొత్త ద‌ర్శ‌కుడితో తేజ్‌...

వ‌రుస‌గా ఆరు ప‌ర‌జయాలు చ‌విచూసిన మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌దుప‌రి సినిమా కోసం స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం ఈ సారి తేజ్ ..