వ‌ర‌ల‌క్ష్మిని పొగుడుతున్నవిశాల్‌

  • IndiaGlitz, [Friday,October 05 2018]

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌కీ, విశాల్‌కీ మ‌ధ్య ఏదో జరుగుతుంద‌ని, ఎప్ప‌టికైనా వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని ఓ ప‌క్క కోలీవుడ్ కోడై కూస్తుంది. అయితే అలాంటిదేమీ లేద‌నీ, తాను మంచి ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని చాలా సార్లు విశాల్ చెప్పారు. అయితే తొలిసారి వ‌ర‌ల‌క్ష్మి లోని న‌టిని గురించి విశాల్ పొగిడారు.

వ‌ర‌ల‌క్ష్మీ న‌టించిన పందెంకోడి 2 సినిమా ఈ నెల 18న విడుద‌ల కానుంది. ఇందులో విశాల్‌, కీర్తి జంట‌గా న‌టించారు.

ఈ సినిమా గురించి విశాల్ మాట్లాడుతూ సినిమా చూసిన వాళ్లంద‌రూ మా పాత్ర‌ల‌న్నిటినీ మ‌ర్చిపోతారు. ఒక్క వ‌ర‌ల‌క్ష్మి పాత్ర‌ను మాత్రం ఇట్టే గుర్తుంచుకుంటారు అని అన్నారు.

ఈ సినిమా ద‌ర్శ‌కుడు లింగు స్వామి మాత్రం వ‌ర‌ల‌క్ష్మి పాత్ర హైలైట్ అయ్యే మాట నిజ‌మే. పందెంకోడి సినిమా అన‌గానే ఓణీవేసిన దీపావ‌ళి పాట‌లో మీరాజాస్మిన్ గుర్తుకొస్తుంది.

ఆమెను రీప్లేస్ చేసే న‌టిగా కీర్తి సురేశ్ ప‌క్కాగా స‌రిపోయింది. మ‌హాన‌టిగా కీర్తి చేసిన మేజిక్‌ని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం. అలాగే ఈ సినిమాలోనూ మీరాజాస్మిన్‌ని మ‌రిపిస్తుంది అని అన్నారు.