రాజ‌కీయాల్లోకి విశాల్‌..!

  • IndiaGlitz, [Tuesday,December 15 2020]

తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితుడైన తమిళ హీరో విశాల్ రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ మీడియాకు తెలియ‌జేశాడు. న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా కొన‌సాగిన విశాల్.. వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఏదో ఒక నియోజ‌క వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల‌ని అనుకుంటున్నాడు. అందుకోసం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఎన్నిక‌ల గెలుపు కోసం త‌న అభిమాన సంఘాల నాయ‌కుల‌తో విశాల్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ఆర్‌.కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో విశాల్ నామినేష‌న్ వేశాడు. అయితే ఎందుక‌నో చివ‌రి నిమిషంలో ఈసీ నామినేష‌న్‌ను రిజెక్ట్ చేసింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గు ప్రణాళిక‌ల‌తో పాల్గొన‌బోతున్నాడు. అయితే ఏ నియోజ‌క వ‌ర్గం నుండి విశాల్ పోటీ చేస్తాడ‌నేది తెలియ‌డం లేదు. అయితే త‌మిళ‌నాడు నిర్మాత‌ల సంఘం, న‌డిగ‌ర్ సంఘాల‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ద‌ర్శ‌కుడు చేర‌న్‌, సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత రాజేంద్ర‌న్ డిమాండ్ చేస్తున్నారు. మ‌రి విశాల్.. ఇత‌రులు డిమాండ్ చేసిన‌ట్లు త‌న ప‌దవుల‌కు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పాల్గొంటాడో లేదో చూడాలి.