బిజెపీ నేతపై విష్ణు మంచు మండిపాటు..

  • IndiaGlitz, [Monday,October 23 2017]

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై వేసిన జిఎస్‌టి ట్యాక్స్ పై మెర్స‌ల్ చిత్రంలో త‌ప్పుగా చూపించారంటూ ఇప్పుడు వివాదం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బిజెపి నాయ‌కులు ఈ విష‌యంపై త‌ప్పు ప‌డుతుంటే, ప‌లువురు వేరే పార్టీ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ర‌జనీకాంత్‌, క‌మ‌ల్ స‌హా ప‌లువురు మెర్స‌ల్‌కు త‌మ మ‌ద్ధ‌తు తెలిపారు.

కాగా దీనిపై మాట్లాడిన న‌ర‌సింహారావు అనే బిజెపి నేత చాలా మంది న‌టుల‌కు విష‌య ప‌రిజ్ఞానం ఉండ‌ద‌ని కామెంట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు స్పందించారు. సినిమా స్టార్లకు జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ లేదనుకుంటే .. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా? మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దు. వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్‌, జయలలిత ఉన్నారు.ఓ అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. క్రిస్టియన్‌ని వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ హిందుత్వాన్ని బాగా నమ్ముతాను. హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతాను. నాకు భాజపాపై గౌరవం ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిని అంటూ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు.

బాలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప‌ర్హాన్ అక్త‌ర్ ఇలాంటి మాట‌లు మాట్లాడ‌టానికి ఎంత ధైర్యం అంటూ మండిప‌డ్డాడు. అస‌లు సినిమా న‌టీన‌టులు త‌మ అభిప్రాయాన్ని కూడా చెప్ప‌కూడ‌ద‌న‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో తెలియ‌డం లేదు.

More News

విశాల్‌పై ఐటీ రైడ్స్‌...

తెలుగు వాడైన త‌మిళ హీరో విశాల్‌..ఇప్పుడు త‌మిళ న‌డిగ‌ర్ సంఘం సెక్ర‌ట‌రీగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప‌లు విష‌యాల్లో యాక్టివ్‌గా ఉండే విశాల్‌, రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైన మెర్స‌ల్ చిత్రంపై చేసిన కామెంట్స్ అత‌నికి స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ప్ర‌భాస్‌కు అనుష్క గిఫ్ట్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు ఇది 38వ పుట్టిన‌రోజు. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఈ పుట్టిన‌రోజు త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకమ‌ని చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రెహ‌మాన్ లైవ్ ఫెర్ఫామెన్స్‌...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నారు.

'ప్రాజెక్ట్ C420' 80 శాతం షూటింగ్ పూర్తి

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపు దిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్ట్ C420 (వర్కింగ్ టైటిల్). సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది.

29న 'ప్రేమపందెం' ఆడియో విడుదల

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’.