విష్ణు మంచు ఓటర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన!

  • IndiaGlitz, [Thursday,November 23 2017]

హీరో విష్ణు మంచు జన్మదిన సందర్భంగా విడుదలైన 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ప్రముఖ కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకుల ముఖచిత్రాలతో నిండి, ఓటర్ గా విష్ణు తన ఇన్క్ వేయబడిన వేలును చూపిస్తున్నట్లున్న 'ఓటర్' ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా పవర్ఫుల్ గా ఉందని ప్రశంసిస్తున్నారందరు.

ప్రధాని నరేంద్ర మోది, అటల్ బిహారి వాజ్పాయ్ నుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ మరియు దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో సహా పలువురు ప్రఖ్యాత నేతల ఫొటోలతో కూడిన పోస్టర్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తికావస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగ్వల్ గా రూపొందుతున్న'ఓటర్' చిత్రంతో విష్ణు తమిళ తెరకు పరిచయం కాబోతున్నారు. తమిళంలో 'కురళ్ 388' అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

"ప్రజా స్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర ఓటర్ దే, కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ పవర్ ఏంటో చూపించే చిత్రం ఇది. కామన్ పాయింట్ కావడంతో తమిళంలో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. తమిళ తెరకు పరిచయం అయ్యేందుకు విష్ణుకు ఇది మంచి చిత్రం అవుతుందని భావిస్తున్నాను," అన్నారు దర్శకుడు. తమిళ ప్రముఖ రాజకీయ నాయకుల ఫొటోలతో నిండిన 'కురళ్ 388' ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అనూహ్య స్పందన వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు నిర్మాత.

ఇతర తారాగణం మరియు సాంకేతిక వర్గం:

సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రవణ్, బేసన్ నాగర్ రవి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: కిరణ్ మన్నే, కూర్పు: కె.ఎల్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, సహ-నిర్మాత: కిరణ్ తనమాల, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాత: జాన్ సుధీర్ కుమార్ పూదోట, కథ-మాటలు-దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.

More News

సైరాలో బోజ్‌పురి న‌టుడు...

బోజ్‌పురిలో స్టార్ న‌టుడిగా పేరు తెచ్చుకున్న ర‌వికిష‌న్ తెలుగులో 'రేసుగుర్రం' చిత్ంతో ఎంట్రీ ఇచ్చాడు. త‌ర్వాత కిక్ 2, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించి త‌న‌దైన విలనిజాన్ని తెర‌పై ఆవిష్క‌రించాడు.

'జ‌వాన్' ట్రైల‌ర్ రివ్యూ...

సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్  జంట‌గా న‌టించిన చిత్రం 'జ‌వాన్'. అరుణాచ‌ల క్రియేష‌న్స్ ప‌తాకంపై కృష్ణ సినిమాను నిర్మించాడు. బి.వి.ఎస్‌.ర‌వి ద‌ర్శ‌కుడు. డిసెంబ‌ర్ 1న సినిమా విడుద‌ల‌వుతుంది.

'ఖాకి' ప్రమోషన్స్పై సంతోషాన్ని వ్యక్తం చేసిన కార్తి,రకుల్

తెలుగులో రెండు దశాబ్దాలుగా ఆడియో రంగంలో టాప్ పోజిషన్లో ఉన్న ఆదిత్య మ్యూజిక్..తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా 'ఖాకి' చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు...

ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వార్త‌ల్లో  నిలుస్తున్నాయి. ప్రేక్ష‌కుల్లో మాస్ ఇమేజ్ ఉన్న ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని వార్త‌లు వినిపించాయి.

డిసెంబర్ 8న సుమంత్ మళ్లీ రావా చిత్రం

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ చిత్ర ఆడియో టీజర్ ను వి