Vishnu:మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలు: విష్ణు

  • IndiaGlitz, [Saturday,March 23 2024]

ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. 'బాహుబలి' నుంచి మన సినిమాల హద్దులు చెరిగిపోయాయి. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్‌ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మా అసోసియేషన్ సిద్ధమైంది. ఈ విషయం తెలియజేస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సమావేశంలో విష్ణు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డ్ రావడం, జై బాలయ్య అనే మాట ఎంతో పాపులారిటీ సంపాదించుకోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ రావటం, ఇండియన్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఎదగడం, మహేష్ రాజమౌళి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రాబోతుండటం, కీరవాణి-చంద్రబోస్ గారికి ఆస్కార్, ఇలా తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ అవుతూ వస్తుంది. అమితాబ్, అనిల్ కపూర్ లాంటి నటులను తెలుగు వారే పరిచయం చేశారు. అందుకే 90ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్‌ని ఇప్పుడు చేయడం కరెక్ట్ అని మేము భావిస్తున్నాము.

అందుకనే మలేషియాలో ‘నవతిహి’ పేరిట చారిత్రాత్మక ఈవెంట్‌ని చేయాలని మా అసోసియేషన్ తరపున నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయం గురించి ఫిలిం ఛాంబర్‌తో కూడా మాట్లాడడం. టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు రోజులు సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారిని ఇందుకు సపోర్ట్ చేయాలని విన్నవించుకున్నాము. వారు సపోర్ట్ ఇస్తామన్నారు. ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి కూడా ఈ ఈవెంట్‌కి సపోర్ట్ వస్తుంది. వారు పాల్గొంటామని తమ సపోర్ట్‌ని తెలియజేస్తున్నారు. జులైలో ఈ వేడుకని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పరిశ్రమ పెద్దలను సంప్రదించి ఈవెంట్ డేట్స్‌ అనౌన్స్ చేస్తాము. తెలుగు సినిమా ఘనకీర్తిని తెలిపేలా ఈ ఈవెంట్ ఉంటుంది అని తెలిపారు.

కాగా 75 సంవత్సరాలు సందర్భంగా 2007లో ‘వజ్రోత్సవం’ వేడుకను తెలుగు సినిమా పరిశ్రమ తరపున ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. హీరోలు అంతా కలిసి డ్యాన్స్‌లు వేస్తూ, స్కిట్‌లు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ 90 సంవత్సరాలను పురస్కరించుకుని ‘నవతిహి' పేరిట వేడుకను నిర్వహించనుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

More News

Kavitha:కవితకు షాక్.. మరో మూడు రోజులు కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ సీబీఐ కోర్టులో మరోసారి చుక్కెదురైంది.

CM Ramesh: కాంగ్రెస్‌కు సీఎం రమేష్ రూ.30కోట్ల విరాళం..? కమలం పార్టీలో కలకలం..

ఏపీ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన స్వార్థ రాజకీయాల కోసం ఎలాంటి కుట్రలైనా చేయడంలో చంద్రబాబును మించిన వారు

Modi:రష్యాలో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ.. ముందే హెచ్చరించిన అమెరికా..

రష్యాలోని మాస్కో(Mascow)లో జరిగిన ఉగ్రవాదుల దాడి(Terror Attack) పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kavitha:లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం షూరూ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళిగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో