`హిట్ 2` వ‌దులుకోడానికి కార‌ణం చెప్పిన విష్వ‌క్ సేన్‌

  • IndiaGlitz, [Monday,March 29 2021]

యువ క‌థానాయ‌కుల్లో విష్వ‌క్ సేన్ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అతి కొద్ది స‌మ‌యంలోనే, 'ఫ‌ల‌క్‌నుమాదాస్' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఒక‌వైపు హీరోగా, మ‌రో వైపు ద‌ర్శ‌కుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లో రాణించాల‌ని త‌ప‌న ప‌డుతున్న ఈ యంగ్ స్ట‌ర్‌..హీరోగా గ‌త ఏడాది హిట్‌తో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది 'పాగ‌ల్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే.

త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విష్వ‌క్ సేన్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాల‌నుత తెలియ‌జేశాడు. డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంవ‌ల్ల‌నే 'హిట్' సీక్వెల్ 'హిట్‌ 2'ను వ‌దులుకున్నాన‌ని విష్వ‌క్ తెలియ‌జేశాడు. అలాగే 'ఫ‌ల‌క్‌నుమాదాస్'‌, 'ఈన‌గ‌రానికి ఏమైంది' చిత్రాల‌కు సీక్వెల్స్ చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌న్నాడు విష్వ‌క్ సేన్‌. అంతే కాదండోయ్‌..ఈ ఏడాది త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించాల‌నుకుంటున్నాన‌ని తెలిపాడు. ఇక హీరోగా, 'ప్రాజెక్ట్ గామీ' అనే క్లాసిక్ అడ్వెంచ‌ర్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిపిన విష్వ‌క్ ... 'పాగ‌ల్' త‌ర్వాత 'ఓ మై క‌డ‌వులే' రీమేక్‌లో న‌టిస్తాన‌ని, త‌ర్వాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు కూడా తెలియ‌జేశాడు మ‌రి.

More News

మూడు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ప్రైజ్!

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత

టాలీవుడ్‌లో సింగర్‌ సునీతకు అభిమాన గణం ఎక్కువే.  టీవీ యాంకర్‌గా, సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు.

18 ఏళ్లుగా నాతో కలిసున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ విడుదలై నేటికి 18 ఏళ్లు. ఈ విషయాన్ని గుర్తు చేస్తే బన్నీ ఓ ట్వీట్ చేశాడు.

బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో

ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. ‘ఎంవీ ఎవర్‌గివెన్’ బయటకు వచ్చేదెప్పుడో..

ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఇరుక్కుపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన ‘ఎంవీ ఎవర్‌గివెన్’